కురుక్షేత్రంలో ఏం జరిగింది?

సీనియర్ హీరో అర్జున్ నటించిన 150 చిత్రం నిబునన్. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో కురుక్షేత్రం పేరుతో ఈ నెల 13న విడుదల చేయబోతున్నారు. అరుణ్ వైద్యనాథన్ దర్శకుడు. శ్రీవాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మీసాల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో కొన్ని మార్పులు చేశాం. తమిళంలో చక్కటి విజయాన్ని సాధించిన చిత్రమిది. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారిని తప్పకుండా మెప్పిస్తుంది అన్నారు. రెండువందలకు పైగా థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కురుక్షేత్రంలో ఏం జరిగిందనేది ఆసక్తిని పంచుతుంది. ఈ సినిమాలో అర్జున్ పోలీసాఫీసర్ పాత్రలో నటించారు అని నిర్మాత తెలిపారు. సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శృతిహరిహరన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అరవింద్‌కృష్ణ, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, స్క్రీన్‌ప్లే: ఆనంద్‌రాఘవ్, అరుణ్‌వైద్యనాథన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్‌వైద్యనాథన్.