దసరా బ‌రిలో కుర్ర హీరో

కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కుర్ర‌ హీరో రామ్ పోతినేని. చివ‌రిగా ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన రామ్ ప్ర‌స్తుతం నేను లోక‌ల్ ఫేం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొని ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలని వేగ‌వంతం చేయాల‌ని భావిస్తుంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న సినిమాని రిలీజ్ చేయనున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్‌. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. కొన్నాళ్లుగా స‌రైన హిట్స్ లేక బాధ‌ప‌డుతున్న రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ల‌కి ఈ చిత్రం మంచి హిట్ అందిస్తుంద‌ని నిర్మాతలు చెబుతున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ త‌ర్వాత రామ్ గ‌రుడ వేగ ఫేం ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించ‌నున్న ఈ సినిమాలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌నుందని టాక్.

× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు