హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్: నగరంలో భారీగా వర్షం పడుతుంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులపై వరద నీరు ఏరులై పారుతుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హస్మాబాద్, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఈ భారీ వర్షంలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీ అత్యవసర సహాయక బృందాలు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
× RELATED 'పంచాయతీ'ఎన్నికల పోలింగ్ ప్రారంభం