ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడి

అనంతపురం: జిల్లాలోని జేఎన్టీయూ క్యాంపస్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో దోపిడి జరిగింది. బ్యాంకు వెనక వైపు కిటికీ గ్రిల్స్ తొలగించి దుండగులు లోపలికి చొరబడ్డారు. బ్యాంకు స్ట్రాంగ్‌రూమ్‌లో రూ.39.15 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. గ్యాస్‌కట్టర్‌తో స్ట్రాంగ్‌రూంను దుండగులు పగలగొట్టారు. కిటికీలు, స్ట్రాంగ్‌రూమ్ తలుపులపై నుంచి క్లూస్‌టీమ్ వేలిముద్రలు సేకరిస్తోంది. సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు డాగ్‌స్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు.

× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు