ఫ్యామిలీస్ రాక‌తో ఎమోష‌న‌ల్ అయిన ఇంటి స‌భ్యులు

నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 2 ఎపిసోడ్ 94 మొత్తం చాలా ఎమోష‌న‌ల్‌గా సాగింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎప్పుడు ఆట‌పాట‌లు, అల్ల‌ర్లు, గొడ‌వ‌ల‌తో ఉండే బిగ్ బాస్ హౌజ్‌లో ఇంటి స‌భ్యులు ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ మూడ్‌లోకి రావ‌డంతో ప్రేక్ష‌కులు కూడా చాలా థ్రిల్ ఫీల‌య్యారు. సీజ‌న్ 2 చివ‌రి ద‌శ‌కి చేరుకోవ‌డంతో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ రిమోట్ కంట్రోల్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ఫ్రీజ్‌, రిలీజ్‌, ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌, రివైండ్ చెప్పిన‌ప్పుడు ప‌క్క‌న ఏం జ‌రిగిన కూడా వాటికి చ‌లించ‌కుండా అలానే ఉండాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసిన‌ప్పుడ‌ల్లా ఆదేశాలకి అనుగుణంగా ఇంటి స‌భ్యులు న‌డుచుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ కుటుంబ స‌భ్యులు ఇంట్లోకి రావ‌డంతో అంద‌రిలో ఎక్క‌డ‌లేని ఆనందం కనిపించింది. ముందుగా సామ్రాట్ త‌ల్లి ఇంట్లోకి ప్ర‌వేశించి కొడుకును చూసి మురిసిపోయింది. నువ్వేంటో అంద‌రికి అర్ధ‌మ‌వుతుంది అని చెప్పింది. ఒక్కొక్క‌రిని ప‌ల‌క‌రిస్తూ వారి గురించి బ‌య‌ట ఏమ‌నుకుంటున్నారో వివ‌రించింది. కౌశ‌ల్‌ని సీరియ‌స్ బాయ్ అంటూ.. గేమ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక నువ్వు అంద‌రితో క‌లిసి ఉండాలంటూ సూచ‌న‌లు ఇచ్చింది. ఇన్ని రోజులు మీరు హౌజ్‌లో ఉండ‌డం చాలా గొప్ప విష‌యం. ఎవ‌రికి టైటిల్ వ‌చ్చిన ప‌ర్వాలేదు. ఇక్క‌డి వ‌ర‌కు రావ‌డ‌మే చాలా గ్రేట్ అంటూ వారిలో ఉత్సాహాన్ని నింపింది సామ్రాట్ తల్లి. సామ్రాట్ తల్లి పాదాల‌కి న‌మ‌స్క‌రించిన కౌశ‌ల్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఇక్క‌డ అంద‌రికి మ‌ద‌ర్స్ ఉన్నారు. నాకే లేరు అన‌డంతో అయ్యో నేను నీ త‌ల్లిలాంటిద‌నేన‌ని కౌశ‌ల్‌ని ఓదార్చే ప్ర‌య‌త్నం చేసింది సామ్రాట్ త‌ల్లి. ఇక బిగ్ బాస్ ఇచ్చిన రిమోట్ కంట్రోల్ టాస్క్ లో అంద‌రు లీన‌మై ఉండ‌గా ఇంట్లోకి వ‌చ్చిన జోక‌ర్ .. రోల్ రైడా మొహానికి మొత్తం కేక్ పూయ‌డం, గీతా మాధురికి లిప్‌స్టిక్ పూయ‌డం లాంటి చిలిపి చేష్ట‌లు చేసి వారి రిలీజ్ అయ్యే లోపే ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఇక కొద్ది సేప‌టి త‌ర్వాత అమిత్ త‌న‌యుడు అంద‌రూ ఫ్రీజ్‌గా ఉన్న స‌మ‌యంలో ఇంట్లోకి వ‌చ్చాడు. త‌న‌యుడిని చూసి చాలా భావోద్వేగానికి గుర‌య్యాడు. వెంట‌నే అమిత్ భార్య కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. వీరిద్ద‌రిని మిగ‌తా ఇంటి స‌భ్యుల‌కి ప‌రిచ‌యం చేశాడు అమిత్‌. కొద్ది సేపు ఫ్యామిలీతో స‌ర‌దాగా గ‌డిపిన త‌ర్వాత వారిద్ద‌రిని ఇంటి నుండి బ‌య‌ట‌కి వ‌చ్చేయాల‌ని బిగ్ బాస్ కోరారు. ఎపిసోడ్ చివ‌ర‌లో దీప్తి త‌న‌యుడు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా రోజుల త‌ర్వాత కొడుకుని చూసి దీప్తి తీవ్ర భావోద్వేగంతో త‌ల్లడిల్లిపోయింది. కొడుకుని గ‌ట్టిగా ప‌ట్టుకొని తన క‌న్న ప్రేమ‌ని చూపించింది. ఇంత‌లోనే స్టోర్ రూంలో బెల్ మోగ‌డంతో అక్క‌డికి వెళ్లి చూసిన దీప్తికిఅత‌ని భ‌ర్త పెద్ద షాక్ ఇచ్చాడు. స్టోర్ రూంలో భ‌ర్త‌ని చూసిన దీప్తి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. భర్త సలహాలను, సూచనలను అందుకున్న దీప్తి.. ఇకపై కాన్ఫిడెంట్‌గా గేమ్ ఆడతానన్నారు. బిగ్ బాస్ హౌస్‌ని వీడే సందర్భంలో తనీష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు దీప్తి భర్త. గేమ్ బాగానే ఆడుతున్నారు కాని, ఫిజిక‌ల్ గేమ్స్ ఆడేట‌ప్పుడు చూసి ఆడితే మంచిద‌ని త‌నీష్‌కి దీప్తి భ‌ర్త స‌ల‌హా ఇచ్చారు. దీంతో త‌ను కారులో ప్ర‌వ‌ర్తించిన తీరుకి ఆయ‌న అలా అన్నాడేమోన‌ని భావించిన త‌నీష్ సిగెరెట్ రూంలోకి వెళ్ళి క‌న్నీళ్ళు పెట్టుకున్నాడు. సామ్రాట్ ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇక నేటి ఎపిసోడ్‌లో గీతా, కౌశ‌ల్‌, రోల్ రైడా కుటుంబ స‌భ్యులు ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుండగా వారు ఏ రేంజ్‌లో ఎమోష‌న‌ల్ అవుతారో చూడాలి.
× RELATED స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు