లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్

చండీగఢ్ : స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి దగ్గర లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చండీగఢ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా చపాతి గ్రామానికి చెందిన మంగళ్ సింగ్‌ను హెడ్ కానిస్టేబుల్ ముఖ్తియార్ సింగ్ ఓ కేసు విషయంలో 50 వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ముఖ్తియార్ సింగ్ చివరకు రూ.30 వేలు ఇవ్వాల్సిందిగా ఒప్పందానికి వచ్చాడు. దీంతో మంగళ్‌సింగ్ విజిలెన్స్ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. విజిలెన్స్ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం లంచం తీసుకుంటుండగా హెడ్‌కానిస్టేబుల్ ముఖ్తియార్ సింగ్‌ను పట్టుకున్నారు. ముఖ్తియార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related Stories: