హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ప్రెసిడెంట్ అదృశ్యం

-మూడురోజులుగా దొరుకని సిద్దార్థ్ సంఘ్వి ఆచూకీ -కిడ్నాప్‌నకు గురై ఉంటాడని పోలీసుల అనుమానం
ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉపాధ్యక్షుడు సిద్దార్థ్ సంఘ్వి అదృశ్యం కావడం కలక లం రేపుతున్నది. మూడు రోజుల క్రితం ఆఫీస్‌కు బయల్దేరిన సంఘ్వి ఆ తర్వాత అదృశ్యమయ్యారు. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్స్ ప్రాంతంలో నివసించే సిద్దార్థ్ సంఘ్వి బుధవారం ఉదయం 8.30 గంటలకు ఇం టి నుంచి బయలుదేరిన రాత్రి పది దాటినా రాకపోవడంతో ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘ్వి పనిచేస్తున్న కమలామిల్స్ ప్రాంతంలోని సీసీటీవీ కేమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించగా.. సాయంత్రం 7.30 గంటలకు ఆఫీస్ నుంచి బయల్దేరినట్లు స్పష్టమైంది. ఆయన ఫోన్‌కు చివరి కాల్ కమలామిల్స్ టవర్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్ స్విచ్చాఫ్ అయిందని గుర్తించారు. మరుసటిరోజు నవీ ముంబైలోని ఐరోలీ 11వ సెక్టార్ వద్ద దొరికిని సంఘ్వి నీలి రంగు మారుతి ఇగ్నిస్ కారు ముందు సీట్లో రక్తం మరకలు ఆ పక్కనే కత్తి దొరకడం పలు అనుమానాలకు తావిస్తున్నది. సంఘ్వి కిడ్నాపై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Related Stories: