హకీంపేటలో ఘనంగా పాసింగ్ ఔట్ పరేడ్

హైదరాబాద్: హకీంపేటలోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఎస్ఏ)లో సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్, ఎస్‌ఐల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. 230 మంది ఎస్‌ఐలు, 24 మంది సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్, రాష్ట్రం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం కేంద్ర మంత్రి ప్రసంగించారు. సరిహద్దుల్లో సైన్యం స్ఫూర్తితో పనిచేయాలని హన్స్‌రాజ్ అన్నారు. శిక్షణలో ఎంత కష్టపడ్డారో.. దేశం కోసం కూడా అదే సంకల్పంతో పనిచేయాలి. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్‌ను అరికడుతున్నామని చెప్పారు. విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Stories: