గెలుపుదిశగా దేవెగౌడ కుమారులు

బెంగళూరు: శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో జేడీఎస్ పార్టీ తనదైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. జేడీఎస్ ప్రస్తుతం 38 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారులు హెచ్‌డీ కుమారస్వామి, హెచ్‌డీ రేవణ్ణ లీడింగ్‌లో కొనసాగుతూ..గెలుపు దిశగా పయనిస్తున్నారు. కుమారస్వామి రామనగర స్థానం నుంచి ఆధిక్యంలో కొనసాగుతుండగా..హెచ్‌డీ రేవణ్ణ హోలెనరాసిపురాలో ఆధిక్యంలో ఉన్నారు. కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థిపై 1552 ఓట్ల ఆధిక్యంతో కుమారస్వామి ముందంజలో ఉన్నారు. కుమారస్వామి తన గెలుపును ఆకాంక్షిస్తూ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో జేడీఎస్ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీలో ఉన్నారు.

Related Stories: