బ్యాంకుల వద్ద సరిపోను కరెన్సీ ఉంది: జైట్లీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో ఉన్న కరెన్సీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అవసరం కన్నా ఎక్కువ నగదు చెలామణిలో ఉన్నట్లు ఆయన ట్వీట్ చేశారు. బ్యాంకుల వద్ద కూడా కావాల్సిన నగదు కరెన్సీ ఉందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో అనూహ్యంగా డిమాండ్ ఏర్పడడం వల్ల పాక్షికంగా నగదు లోటు ఏర్పడినట్లు ఆయన తెలిపారు. కరెన్సీ కొరత ఏర్పడిన ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యలను తీసుకుంటున్నట్లు జైట్లీ చెప్పారు. నగదు కొరత వల్ల చత్తీస్‌ఘడ్‌లో తీవ్ర ప్రభావం ఉన్నట్లు ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ తెలిపారు. వీలైనంత త్వరలో పరిస్థితి మెరుగుపడుతుందని సీఎం అన్నారు.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య