పశువుల దొంగ అనుకొని కొట్టి చంపారు

మూకుమ్మడి దాడులపై చట్టంచేసే ప్రయత్నాలు ఓ వైపు జరుగుతుండగానే పశువులు దొంగిలిస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని కొట్టించంపారు. ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో హర్యనాలోని పాల్‌వల్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. బహరోలా గ్రామంలో పశువుల దగ్గర కనిపించిన ముగ్గురిని గ్రామస్థులు వెంబడించారు. వారిలో ఇద్దరు తప్పించుకోగా ఒకవ్యక్తి పట్టుబడ్డాడు. అతడిని చెట్టుకు కట్టేసి ఇష్టంవచ్చినట్టు కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆలస్యంగా క్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపి ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు సోదరులపై కేసు నమోదు చేశారు.

× RELATED పైళ్ల శేఖర్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలి: సీఎం కేసీఆర్