కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీకి..టీడీపీకి ఓటేస్తే అమరావతికి..

మెదక్: సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని హరీశ్ రావు అన్నారు. మెదక్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ..కూటమితో వచ్చేది లేదు పోయేది లేదని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఢిల్లీకి పోతది..టీడీపీకి వేస్తే అమరావతికి పోతదన్నారు. ఢిల్లీకి గులాం చేయడానికి, అమరావతికి సలాం చేయడానికో తెలంగాణ తెచ్చుకోలేదని అన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిదాంతం..రాహుల్ కన్ను కొట్టే సిద్దాంతమని ఎద్దేవా చేశారు. వచ్చే వానాకాలం నాటికి మెదక్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తమన్నారు.

Related Stories: