నాన్నగారిలానే హుందాగా ఉండేవారు..

హైదరాబాద్: అన్నయ్య హరికృష్ణ నాన్నగారిలానే హుందాగా ఉండేవారని ఆయన సోదరుడు, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. హరికృష్ణ నివాసం వద్ద బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..హరికృష్ణ అందరితో మంచిగా, కలుపుగోలుగా ఉండేవారన్నారు. తాతగారి వద్ద సొంత ఊరిలో ఆయన పెరిగారు. పార్టీలో అందరిని కలుపుకొని పోయేవారు. ఆయన మరణం మా కుటుంబానికి, తెలుగు దేశం పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటన్నారు. సంస్కృతి, సంప్రదాయం, బంధుత్వానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మబుద్ది కావడం లేదని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

× RELATED కుప్పకూలిన కివీస్.. భారత్ టార్గెట్ 158