మమతా బెనర్జీ లేడి మహాత్మా

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై పటేల్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించారు. మమతా బెనర్జీని లేడి మహాత్మా అని పటేల్ అభివర్ణించారు. మమతా సాధారణ, స్వార్థం లేని మనిషి అని ఆయన కొనియాడారు. బెంగాల్ సచివాలయంలో శుక్రవారం మమతను హార్ధిక్ పటేల్ కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు. మమతా బెనర్జీతో భేటీ సందర్భంగా ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ప్రజలతో ఎలా మెలగాలి.. మాట్లాడాలి.. అనే విషయాలపై సూచనలు, సలహాలు ఇచ్చారని పటేల్ పేర్కొన్నారు. దేశ ప్రజల బాగోగులు పట్టించుకునే వ్యక్తులను ఎన్నికల్లో గెలిపించాలని హార్ధిక్ పటేల్ విజ్ఞప్తి చేశారు. దేశాన్ని విడగొట్టే నాయకులకు చరమగీతం పాడాలన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో మోదీని గెలిపిస్తే.. దేశం ముక్కలవడం తప్పదన్నారు. అన్ని పార్టీలు కలిసి ప్రస్తుత ప్రభుత్వంపై పోరాడాలి అని పిలుపునిచ్చారు. విద్యా, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, భద్రతపై మాట్లాడకుండా.. పార్లమెంట్‌లో 90 నిమిషాల పాటు రాజకీయ ప్రసంగం చేసే వారు మనకు వద్దని పటేల్ హితవు పలికారు.
× RELATED నాటు తుపాకీ స్వాధీనం: ఇంజినీరింగ్ విద్యార్ధి అరెస్టు