దీక్ష విర‌మించిన హార్దిక్ ప‌టేల్‌

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్ నేత హార్దిక్‌ ప‌టేల్‌.. నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌ను విర‌మించారు. 19 రోజుల త‌ర్వాత ఆయ‌న దీక్ష‌ను విడిచారు. పాటిదార్‌ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని ఆయ‌న ఆందోళ‌న నిర్వ‌హించారు. రైతుల రుణాలు కూడా మాఫీ చేయాల‌ని ఆయ‌న కోరారు. పాటిదార్లకు విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ గుజరాత్‌లోని పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ నిరవధిక నిరాహార దీక్ష చేప‌ట్టారు. హార్దిక్ పటేల్ ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్నదని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) అధికార ప్రతినిధి మనోజ్ పనారా చెప్పారు. ఒకవేళ తాను మరణిస్తే తన నేత్రాలను దానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా తృణమూల్, ఎన్సీపీ, ఆర్జేడీతోపాటు బీహార్ మాజీ సీఎం జీతన్ మాంఝీ రాం, గుజరాత్ అసెంబ్లీలో విపక్ష నేత పరేష్ ధనానీ తదితరులు హార్దిక్ దీక్షకు మద్దతు పలికారు.
× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..