హార్దిక్ పటేల్ దీక్ష విరమణ

అహ్మదాబాద్: పలు డిమాండ్లతో 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నాయకుడు హార్దిక్ పటేల్ దీక్ష విరమించారు. బుధవారం పాటిదార్ నాయకులు అందించిన నిమ్మరసం తాగారు. పాటిదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని, అరెస్తు చేసిన పాస్ నేతను విడుదల చేయాలని, రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 25న తన ఇంట్లోనే హార్దిక్ పటేల్ నిరవధిక దీక్షకు దిగారు. 19 రోజులు గడిపినప్పటికీ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్చలు జరిపేందుకు ముందుకురాలేదు. దీంతో చివరకు ఆయనే దీక్ష విరమించారు. ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. పాటిదార్లకు రిజర్వేషన్, రైతుల రుణమాఫీ కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అని ప్రకటించారు.
More in తాజా వార్తలు :