జగదేకవీరుని కథలో...

ప్రస్తుతం అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలకానుంది. దీనితో పాటు ఆయన ఓ చారిత్రక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి జగదేకవీరుని కథ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఎంవీయన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై యస్. శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మిస్తున్నారు.