పరారీ ముద్ర తీసేయండి: విజయ్ మాల్యా

న్యూఢిల్లీ: తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నాడు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా బకాయిపడగా, రెండున్నరేండ్ల క్రితం ఈ లిక్కర్ వ్యాపారి లండన్‌కు చెక్కేసిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి గత రెండు రోజులుగా అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలనే చేస్తున్న మాల్యా.. ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని వేడుకున్నాడు. శుక్రవారం ఈ కేసును సుప్రీం విచారణకు స్వీకరించే వీలున్నది. వచ్చే వారం భారత్‌కు మాల్యాను అప్పగించే కేసులో వెస్త్‌మినిస్టర్ కోర్టు తీర్పు చెప్పనున్నది.

Related Stories: