జివికె ఈఎంఆర్‌ఐలో ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్ : జివికె ఇఎంఆర్‌ఐ 108 కాల్ సెంటర్ నందు పనిచేసేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్స్ (ఇఆర్‌వో)అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రోగ్రాం మేనేజర్ నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. డిగ్రీ ఉత్తీర్ణత విద్యార్హతగా కాగా హైదరాబాద్ కాల్ సెంటర్‌లో 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉండాలని, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాషలు వచ్చి ఉండాలన్నారు. మేడ్చల్ రోడ్డులోని దేవరయాంజల్ జీవికే ఇఎంఆర్‌ఐ 108 కార్యాలయం నందు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9100799599/9100799116/9100799589 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
× RELATED తాగిన మైకంలో బాంబు బెదిరింపులు..జైలు శిక్ష