ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం..

గుజరాత్ : ఇవాళ ఉదయం 8 గంటలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల్లో 37 కేంద్రాల్లో, హిమాచల్ ప్రదేశ్‌లోని 42 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సాగనున్నది. గుజరాత్‌లో మొత్తం182 స్థానాల నుంచి 1,828 మంది పోటీ చేశారు. గుజరాత్ లో అధికారం దక్కాలంటే కనీసం 92 స్థానాల్లో గెలుపు తప్పనిసరి, అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 68స్థానాల్లో 337 మంది అభ్యర్థులు పోటీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 35 స్థానాల్లో గెలుపు తప్ననిసరి. రాష్ట్రమంతటా ఈవీఎంలే వాడినందున మధ్యాహ్నం 12గంటలకల్లా గుజరాత్‌లో, ఉద యం 10గంటలకల్లా హిమాచల్‌లో పూర్తి ఫలితాలు రావచ్చునని అధికారులు భావిస్తున్నారు.
× RELATED ఇంజిన్ రహిత రైలు ట్రైయిల్ రన్ విజయవంతం