టైటిల్ గెస్ చేయండి.. జ్యోతికని క‌ల‌వండి

36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్ర‌స్తుతం ప‌లు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తుంది. ఇటీవలి కాలంలో ‘మగళీర్ మట్టుం’, నాచియార్ అనే చిత్రాల‌తో అల‌రించింది. నాచియార్ చిత్రం శివ పుత్రుడు , నేనే దేవుడ్ని , వాడు వీడు లాంటి చిత్రాలు తెర‌కెక్కించిన‌ బాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమాలోని డైలాగ్స్ జ్యోతిక‌ని ప‌లు ఇబ్బందుల్లోకి నెట్టిన సంగ‌తి తెలిసిందే. క‌ట్ చేస్తే జ్యోతిక బాలీవుడ్ బ్యూటీ విద్యాబాల‌న్ న‌టించిన తుమ్హారీ సులు అనే బాలీవుడ్ మూవీని రీమేక్ చేస్తుంది . రాధామోహ‌న్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమాకి ధ‌నుంజ‌యంగ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. బోఫ్తా మీడియా వ‌ర్క్స్ బేన‌ర్‌పై ధ‌నుంజ‌యంగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే నిర్మాత‌లు చిత్రానికి సంబంధించి కాంటెస్ట్ పెట్టారు. జ్యోతిక రీమేక్ చేయ‌బోవు చిత్రానికి టైటిల్ గెస్ చేసిన ప‌ది ల‌క్కీ విన్న‌ర్స్ షూటింగ్ తొలి రోజు టీంతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపే అవ‌కాశం క‌లిపించారు. జూన్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం రెండు ప‌దాల‌తో ఉంటుంద‌నే హింట్ ఇచ్చారు. ఏప్రిల్ 20తో కాంటెస్ట్ పూర్తి కానుంది. ఈ సినిమా కోసం జ్యోతిక త‌న‌ మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకుంటుంది. ఉంగ‌ల్ జో అనే టైటిల్ త‌మిళ వర్షెన్‌కి ఫిక్స్ చేశార‌ని టాక్‌. దీనిపై మ‌రి కొద్ది రోజుల‌లో క్లారిటీ రానుంది.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?