హైబీపీకి చెక్ పెట్టే పెస‌లు..!

పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయనీ, ఆరోగ్యానికి మంచిదనీ తెలిసిందే. అలాగే వాటి మొలకల్లో ఎంజైములూ, యాంటీ ఆక్సిడెంట్లూ మరింత ఎక్కువగా లభ్యమవుతాయి. అందుకే ఇటీవల వీటిని చాలామంది మొలకెత్తించి తింటున్నారు. అయితే వీటిని మొలకల రూపంలో లేదా ఉడికించి... ఎలా తిన్నా లివ‌ర్‌, వెంట్రుక‌లు, గోళ్లు, క‌ళ్లు, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఆయుర్వేదం చెబుతున్న‌ది.

1. క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువగా ఉండటంతో కొంచెం తిన్నా పొట్ట నిండినట్లనిపిస్తుంది. ఫలితంగా ఊబకాయం తగ్గుతుంది.

2. పెసల్ని క్రమం తప్పకుండా తినేవాళ్లు వారి అస‌లు వయస్సు కన్నా పదేళ్లు తక్కువగా కనిపిస్తారు. వీటిలో అధిక కాపర్ ఉండ‌డం వల్ల చర్మం ముడ‌తలు పడకుండా ఉంటుంది.

3. అజీర్తి, జీవక్రియాలోపంతో బాధపడేవారికి పెసలు మందులా పనిచేస్తాయి. కొలెస్ట్రాల్‌నూ తగ్గిస్తాయి. వీటిల్లోని కాల్షియం ఎముక నిర్మాణానికీ దోహదపడుతుంది. సోడియం దంతాలు, చిగుళ్ల సమస్యల్నీ నివారిస్తుంది.

4. బీపీ రోగులకీ ఇవి మంచిదే. పెస‌ల‌ను రోజూ ఉడికించి తింటే బీపీ అదుపులోకి వ‌స్తుంది. పెసల్లోని ఐరన్‌వల్ల అన్ని అవయవాలకీ ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుంది. ఫలితంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి... వంటి లోపాలతో బాధపడే వాళ్లకీ ఇవి ఎంతో మేలు చేస్తాయి.

5. పెస‌లు రోగనిరోధకశక్తినీ పెంచుతాయి. వీటిల్లోని విటమిన్లు హార్మోన్లను ప్రేరేపించడంలో, పిల్లల్లో పెరుగుదలకీ తోడ్పడతాయి.

Related Stories: