భారీగా ఈ సిగరెట్లు పట్టివేత

ఒకరు అరెస్ట్.. రూ. 7 లక్షల సొత్తు స్వాధీనం.. పరారీలో నిర్వాహకుడు హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రానిక్ సిగరెట్లు, అందులో ఉపయోగించే ప్లేవర్లను మార్కెట్లో విక్రయిస్తున్న ఓ సంస్థపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇందులో రూ. 7 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ సిగరేట్లు, 700 రకాలైన ప్లేవర్స్‌ను, రూ. 33,430 నగదును స్వాధీనం చేసుకొని, వీటిని మార్కెటింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. కదిరికొస్తూబ్ నారాయణరెడ్డి... ఖైరతాబాద్, రెసిడెన్షియ్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యాప్ ఏజెన్షియల్స్ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ యంత్రాలు, అందులో ఉపయోగించే వివిధ రకాలైన ప్లేవర్స్‌ను బహిరంగ మార్కె ట్లో విక్రయిస్తున్నాడు. ఇందుకు బాలకృష్ణ, చెరుకూరి ఆదిత్య అనే ఇద్దరిని ఉద్యోగులుగా నియమించుకున్నాడు. వారితో బయట మార్కెట్లో విక్రయాలు చేస్తున్నాడు. రాష్ట్రంలో పొగాకు, నికోటిన్‌తో కూడిన మత్తుపదార్థాల విక్రయాలపై నిషేధం ఉంది. దాంతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్(ఈఎన్‌డీఎస్) ప్రజల ఆరోగ్యానికి చేటు చేస్తుందని, వాటి విక్రయాలపై నిషేధం విధించింది, ఇందులో ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నిషేధిత వస్తువులైన ఈ సిగరెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో, ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు బృందం ఆ సంస్థపై దాడి చేసింది. ఇందులో నిర్వాహకుడైన సు రేందర్‌రెడ్డి పరారీలో ఉండగా, మార్కెటింగ్ చేస్తున్న బాలకృష్ణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

Related Stories: