ఖైర‌తాబాద్ గ‌ణేశ్ కు గ‌వ‌ర్న‌ర్ తొలి పూజ

హైద‌రాబాద్: ఖైర‌తాబాద్ గ‌ణేశ్ కు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ నరసింహన్‌ తొలి పూజ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఖైర‌తాబాద్ శ్రీ చండీ కుమార అనంత మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకున్నారు. 57 అడుగుల ఎత్తులో ఉన్న గ‌ణేశ్ ను ద‌ర్శించుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ పూజ‌లో గ‌వ‌ర్న‌ర్ స‌తీమ‌ణి పాల్గొన్నారు. ఆ త‌ర్వాత ఖైర‌తాబాద్ గ‌ణేశ్ ను నిజామాబాద్ ఎంపీ క‌విత ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Related Stories: