సీఎంగా చంద్రబాబు రాజీనామాకు గవర్నర్ ఆమోదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. చంద్రబాబు రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని చంద్రబాబుకు గవర్నర్ నిర్దేశించారు. ఇవాళ వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ 150స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..టీడీపీ కేవలం 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవడంతో చంద్రబాబు తన పదవికి రాజీనామా చేశారు.