గవర్నర్, సీఎం వినాయకచవితి శుభాకాంక్షలు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులకు అత్యంత ప్రముఖమైన ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని గవర్నర్ చెప్పారు. చవితి సంబురాల్లో యువత కీలకపాత్ర పోషిస్తుందన్నారు. విఘ్నాలు తొలగించి తమను విజయపథంలో నడిపించడానికి వినాయకుడికి భక్తులంతా పూజలు నిర్వహిస్తారన్నారు. కష్టాల్లేకుండా ప్రజలు ప్రశాంతంగా జీవించాలని వినాయకుడిని ప్రార్థిస్తున్నానని గవర్నర్ తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా కొనసాగాలని, అన్ని పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందాలని సీఎం ఆకాంక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

Related Stories: