నిశ్చితార్థం రద్దు ఆలోచనలో హీరోయిన్..?

ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక మందన్న. రష్మిక కన్నడ నటుడు, డైరెక్టర్ రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. వీరిద్దరు గతేడాది నిశ్చితార్థం పూర్తి చేసుకున్నారు. అయితే రష్మిక వరుస ఆఫర్లు వస్తుండటంతో తమ నిశ్చితార్థం రద్దు చేయాలనుకుంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రష్మిక ప్రస్తుతం విజయ్‌దేవర కొండతో కలిసి గీత గోవిందం సినిమా చేస్తున్నది.

రష్మిక, విజయ్ క్లోజ్‌గా ఉండే ఈ సినిమా పోస్టర్లపై రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రష్మిక అతని అభిమానులకు కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత రష్మిక, రక్షిత్‌ల మధ్య మాటలు లేవని, కెరీర్ అద్భుతంగా ఉన్న సమయంలో నిశ్చితార్థం రద్దు చేసుకోవాలని రష్మిక భావిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని రష్మిక సన్నిహితులు వెల్లడిస్తున్నట్లు టాక్. అయితే ఈ వార్తలపై రష్మిక, రక్షిత్‌శెట్టి ఇప్పటివరకు స్పందించలేదు.

× RELATED రేపు నగరంలో ట్రాఫిక్ అంక్షలు..