పదవుండి చేస్తే పనిమంతుడంటారు.. లేకుండా చేస్తే శ్రీమంతుడంటారు

మాచో హీరో గోపిచంద్ ప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న గోపిచంద్ ప్ర‌స్తుతం చ‌క్రి ద‌ర్శ‌క‌త్వంలో పంతం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ‌రీన్ క‌థానాయికగా న‌టిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇవాళ విడుద‌లైంది. పంతం అనే టైటిల్‌కి ఫ‌ర్ ఏ కాజ్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ సినిమాతో త‌ప్ప‌క స‌క్సెస్ సాధించాల‌నే క‌సితో గోపిచంద్ ఉన్నాడు. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా... ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కెకె రాధామోహన్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. సామాజిక అంశాల నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. జులై 5 న సినిమా రిలీజ్ అవనుంది. ఇదివరకు రిలీజయిన టీజర్ గోపిచంద్ అభిమానులను బాగానే అలరించింది. మ‌రి తాజాగా విడుద‌లైన ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరి..

Related Stories: