కేరళకు గూగుల్ 7 కోట్ల సాయం

తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోవడానికి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. సంస్థ తరఫున మిలియన్ డాలర్లు (సుమారు రూ.7 కోట్లు) విరాళంగా ఇవ్వనున్నట్లు గూగుల్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. గూగుల్.ఓఆర్‌జీ, గూగులర్స్ కలిసి కేరళ సహాయక చర్యల కోసం మిలియన్ డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారు అని గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న ఆ సంస్థ ఆగ్నేయాసియా వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ తెలిపారు. కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ టీమ్ పలు రకాల చర్యలను చేపట్టింది.

అందులో భాగంగా కేరళలో పర్సన్ ఫైండర్ టూల్‌ను యాక్టివేట్ చేసింది. దీనిద్వారా 22 వేల మంది సమాచారం తెలిసింది. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో 417 మంది మృత్యువాత పడగా.. 8 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఈ వరదల కారణంగా కేరళకు సుమారు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

Related Stories: