ఆ నగదు దొంగ గూగుల్ ఉద్యోగి కాదట

ఢిల్లీలో తాజ్ ప్యాలేస్ హోటల్‌లో ఓ విదేశీ పర్యాటకురాలు బ్యాగులో నుంచి పదివేల రూపాయలు కొట్టేసిన చిల్లరదొంగ తమ ఉద్యోగి కాదని గూగుల్ సంస్థ స్పష్టం చేసింది. గతనెల ఈ దొంగతనం జరిగింది. గర్విత్ సాహ్నీ అనే వ్యక్తిని పోలీసులు సదరు దొంగగా గుర్తించి అరెస్టు చేశారు. గర్విత్ చెప్పిన కహానీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన గర్ల్ ఫ్రెండ్ ఖర్చులు భరించలేక తాను దొంగతనానికి ఒడిగట్టినట్టు పోలీసులకు అతడు వెల్లడించాడు. అతనివద్ద నుంచి దొంగిలించిన సొమ్ములో మూడు వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో గర్విత్ తాను గూగుల్ ఎగ్జిక్యూటివ్‌నని చెప్పుకోవడంతో మరింత సంచలనం కలిగింది. గూగుల్ ప్రతిష్ఠకు ఇది మచ్చలా తయారైంది. దాంతో గర్విత్ అనే పేరుగల వ్యక్తి ఎవరూ తమ దగ్గర పనిచేయడం లేదని గురువారం ఓ ప్రకటనలో ఖండన ఇచ్చింది.
× RELATED గిరిజన ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వండి