చైనా సెర్చ్ ఇంజిన్ డేటాను డిలీడ్ చేయండి: గూగుల్

గూగుల్.. ఈ కంపెనీ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికి ఈ పేరు పరిచయమే. ఇంటర్నెట్‌లో ఏ సమాచారం కావాలన్నా చాలామంది గూగుల్ మీదే ఆధారపడతారు. మన ఇండియాలో అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది. కానీ.. చైనాలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదు. దాన్ని చైనాలో బ్యాన్ చేశారు. చైనాలో చైనా కంపెనీలు తయారు చేసిన సెర్చ్ ఇంజిన్లనే వాడుతారు. గూగుల్ చైనా ప్రజల సమాచారాన్నంతా సేకరిస్తుందని గూగుల్‌ను చైనా ప్రభుత్వం బ్యాన్ చేసింది. కానీ.. చైనాలోనూ తమ సెర్చ్ ఇంజిన్‌ను లాంచ్ చేయాలని గూగుల్ ఆరాటపడుతోంది. అందుకే సెన్సార్డ్ సెర్చ్ ఇంజిన్‌ను త్వరలో లాంచ్ చేయబోతున్నది గూగుల్. దానికి సంబంధించిన డెవలప్‌మెంట్ వర్క్ కూడా నడుస్తోంది. దానికి డ్రాగన్ ఫ్లై అనే పేరు కూడా పెట్టారు. అంతా బాగానే నడుస్తుందనుకుంటుండగా.. సడెన్‌గా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నుంచి చైనా సెర్చ్ ఇంజిన్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్న ఉద్యోగులకు మెయిల్ వెళ్లింది. ఏమనీ అంటే.. వెంటనే డ్రాగన్‌ ఫ్లై సెర్చ్ ఇంజిన్‌కు సంబంధించిన మెమోను డిలీట్ చేయాలని. మెమో అంటే ఏం లేదు.. ఆ సెర్చ్ ఇంజిన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు.. సెర్చ్ ఇంజిన్ పనితీరు లాంటి సమాచారానికి సంబంధించినదన్నమాట. దాన్ని వెంటనే డిలీట్ చేయాలని సుందర్ నుంచి మెయిల్ వెళ్లిందని రిపోర్టులు తెలుపుతున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సెర్చ్ ఇంజిన్ ద్వారా యూజర్ లొకేషన్, గూగుల్‌కు చెందిన చైనీస్ పార్ట్‌నర్‌కు యూజర్ డేటా తెలిసిపోతుందట. ఆ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ చేయాలన్నా ఖచ్చితంగా యూజర్ లాగిన్ అవ్వాలి. అంతే కాదు.. ఈ సెర్చ్ ఇంజిన్‌లో సెన్సిటివ్ టాపిక్స్ అయినటువంటి పాలిటిక్స్, ఫ్రీ స్పీచ్, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, శాంతియుతమైన నిరసన లాంటి వాటిని బ్లాక్ చేశారట. ఇటువంటి సెన్సిటివ్ డేటా బయటికి రావడం గూగుల్ ఉద్యోగుల నిరసనకు కారణమైందని రిపోర్టులు తెలుపుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ సెన్సిటివ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డేటాను అంతా డిలీట్ చేసేయాలని గూగుల్ ఉద్యోగులకు సీఈవో మెయిల్ పంపించాడట.

Related Stories: