సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు : గొంగిడి సునీత

యాదాద్రి భువనగిరి : నాపై నమ్మకముంచి ఆలేరు నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గొంగిడి సునీత చెప్పారు. యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు. తాను చేసే ప్రయత్నానికి స్వామివారి ఆశీస్సులు కావాలని నరసింహాస్వామిని కోరుకున్నానని తెలిపారు. మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలకు గందమల్ల రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. ఆలేరు ప్రజలు తనను మళ్లీ ఒకసారి ఆశీర్వదించాలని కోరుతున్నానని సునీత పేర్కొన్నారు.
× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్