పురీషనాళంలో బంగారం

న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన యువకుడు (24) పురీషనాళం (రెక్టమ్)లో రూ.32 లక్షల విలువైన బంగారం కడ్డీలు పెట్టుకుని అక్రమంగా తరలించబోయి పట్టుబడ్డా డు. దీన్ని పసిగట్టిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు.. తొలుత ఆయన లగేజీని, తర్వాత ఆయ న్నూ పరిశీలించడంతో పురీషనాళంలో 1.04 కేజీల బరువుండే 9 బంగారం కడ్డీలు ఉన్నట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని అతడ్ని అరెస్ట్ చేసినట్టు కస్టమ్స్ అధికారులు చెప్పారు. మరో రెండు కేసుల్లో ఓ భారతీయుడు సహా సింగపూర్ నుంచి వచ్చిన ఫ్రెంచ్ దేశస్థుడిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి దాదాపు కిలోన్నర బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.