ఆ డైలాగ్స్ కి రోమాలు నిక్క పొడుచుకోవలసిందే..!

ఈ మధ్య సందేశాత్మక చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్ ఈసారి దేశభక్తి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 1948లో స్వతంత్ర భారత్ ఒలింపిక్స్ హాకీలో గోల్డ్ మెడల్ సాధించిన ఇతివృత్తంతో ఈ మూవీ తెరకెక్కింది. ఆగస్ట్ 15న చిత్రం విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కోచ్‌గా కనిపించనున్నాడు. ఒలింపిక్స్ మెన్స్ హాకీలో ఇండియా మొత్తం 8 గోల్డ్ మెడల్స్ సాధించగా... అందులో మూడు బ్రిటిష్ ఇండియా జెండా కిందే వచ్చాయి. 200 ఏళ్లు మనల్ని పాలించిన అదే ఆంగ్లేయులను ఓడించి స్వతంత్ర భారతావని తొలి గోల్డ్ మెడల్ సాధించాలని కలలు కనే కోచ్ పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. తాజాగా ఐమాక్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. హాకీ జట్టులోని సభ్యులు గొడవపడడం చూసి .. మనదేశానికి ఫ్రీడం వచ్చింది. మనలో మనకి ఐకమత్యం లేకపోతే బయటవారు వచ్చి మనల్ని ఓడించడం సులువు అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక భారతీయుల గొప్పతనాన్ని వివరిస్తూ కూడా ఓ డైలాగ్ ఉంది. రాష్ట్రాలు, నగరాలు , ప్రాంతాలు, జిల్లాలు , మీకున్న పొగరు, అహంకారం చూసుకుంటూ బ్రతికేయండి. మేం మాత్రం మా భారతదేశాన్ని చూసుకుంటాం అనే డైలాగ్ కూడా అదిరిపోయింది. తపన్ దాస్ అనే హాకీ టీం అసిస్టెంట్ మేనేజర్ పాత్రలో అక్షయ్ అదరగొట్టాడు. ద డ్రీమ్ దట్ యునైటెడ్ ద నేషన్ అనే ట్యాగ్‌లైన్‌తోనే సినిమా ఉద్దేశాన్ని మూవీ మేకర్స్ ఇప్పటికే చెప్పేశారు. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మౌనీ రాయ్‌, కునాల్‌ కపూర్‌, అమిత్‌ సద్‌, వినీత్‌ కుమార్‌సింగ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు. మ‌రోవైపు కేసరి అనే చారిత్రాత్మక చిత్రంతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అక్షయ్. బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. అనురాగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ సిక్కుగా కనిపించనున్నాడని టాక్.
× RELATED వైర‌ల్‌గా మారిన మ‌జిలి లొకేష‌న్ పిక్స్