గోద్రా కేసు.. ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష

అహ్మదాబాద్: గోద్రా రైలుకు నిప్పు అంటించిన కేసులో.. ఇవాళ ప్రత్యేక సిట్ కోర్టు ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది. 2002లో సబర్మతి రైలులో జరిగిన ఘటనలో 59 మంది కరసేవకులు చనిపోయారు. నిందితులు ఫారూక్ బహనా, ఇమ్రాన్ షెరూలకు జీవితకాల శిక్షను విధిస్తూ ప్రత్యేక జడ్జి హెచ్‌సీ వోరా తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 27, 2001లో సబర్మతి రైలులోని రెండు బోగీలకు నిప్పు అంటించిన కేసులో ఇవాళ కోర్టు ఇద్దర్ని దోషులుగా తేల్చింది. అయితే ఇదే కేసులో మరో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. హుస్సేన్ సులేమాన్ మోహన్, కసమ్ బామేడి, ఫారుక్ దాంటియాలను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 2015 నుంచి ఈ అయిదుగుర్ని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. సబర్మతి సెంట్రల్ జైలులో ఈ కేసు విచారణ జరిగింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో 8 మంది పరారీలో ఉన్నారు. 2011, మార్చి ఒకటవ తేదీన.. ఈ కేసులో ప్రత్యేక సిట్ కోర్టు మొత్తం 31 మందిని దోషులుగా తేల్చింది. అందులో 11 మంది మరణశిక్షను, 20 మందికి జీవితఖైదును ఖరారు చేశారు.

Related Stories: