2 కోట్లు ఇవ్వండి.. గుజరాత్ సీఎం సెక్స్ సీడీ చేస్తా!

న్యూఢిల్లీ: తన వ్యక్తిగత జీవితాన్ని బజారుకు లాగడానికి ప్రయత్నిస్తున్న వారికి సమాధానమిచ్చాడు గుజరాత్ పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్. జీ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెక్స్ సీడీ కంటే చర్చించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని ఈ సందర్భంగా హార్దిక్ అన్నాడు. ఆ సెక్స్ సీడీలో ఉన్నది నేనా అన్నది ఎవరికీ సంబంధం లేని అంశం. నా వ్యక్తిగత జీవితం గురించి సమాధానమివ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆ సీడీ పూర్తిగా అబద్ధం. మీరు నాకు రెండు కోట్లు ఇవ్వండి. అందులో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మొహాన్ని మార్ఫింగ్ చేసి చూపిస్తా అని హార్దిక్ అన్నాడు. అసలు అంశాల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి బీజేపీ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇవని హార్దిక్ ఆరోపించాడు. సెక్స్ సీడీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు. స్నానం చేస్తున్న సమయంలోనూ కిటీలను పూర్తిగా మూసేస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు. గత మే నెలలో ఓ హోటల్ రూమ్‌లో హార్దిక్ ఓ మహిళతో ఉన్న వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Related Stories: