ఎఫ్‌బీ నుంచి అమ్మాయిల ప్రొఫైల్స్ డౌన్‌లోడ్ చేసి..

న్యూఢిల్లీ: ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్ సోషల్‌మీడియా ఖాతాల నుంచి అమ్మాయిల ప్రొఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని గురుగ్రామ్‌లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాశ్ చౌదరీ (34)మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆకాశ్ ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్ నుంచి అమ్మాయిల ప్రొఫైల్ వివరాలు డౌన్‌లోడ్ చేసి వాటిని నకిలీ ఐడీగా మారుస్తాడు. నకిలీ ఐడీల పేరుతో డబ్బు వసూళ్లు చేస్తాడని ఈస్ట్ జోన్ డీసీపీ చిన్మయి బిస్వాల్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
× RELATED రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి