స్వలింగసంపర్కం.. కట్టేసి కొట్టారు

పాట్నా : బీహార్‌లో దారుణం జరిగింది. ఒక అమ్మాయి మరో అమ్మాయితో స్వలింగసంపర్కం కొనసాగిస్తుందని కొందరు యువకులు అనుమానం పెట్టుకున్నారు. దీంతో ఆ అమ్మాయిని ఒక పోల్‌కు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనను రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో చిత్రీకరించి వైరల్ చేశాడు. ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిపై దాడి చేసిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Stories: