బాలిక కిడ్నాప్‌నకు యత్నం

ఖానాపురం : బాలికను కిడ్నాప్ చేయడానికి యత్నించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుధరావుపేట గ్రామానికి చెందిన లకావత్ జ్యోతి-రవి దంపతుల కుమార్తె ఝాన్సీ(9) ఇంటి సమీపంలోని అంగన్‌వాడీ సెంటర్ వద్ద ఆడుకుంటోంది. అదే సమయంలో ఆటోలో ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి అటుగా వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి తమవెంట తీసుకెళ్లారు.

గమనించిన అంగన్‌వాడీ సెంటర్ నిర్వహకులు వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలిక తండ్రి రవి వెంటనే పోలీసులు, స్థానిక యువకులకు సమాచారం అందించడంతో యువకులు వెంబడించి వారిని పట్టుకున్నారు. అప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై అభినవ్ ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, వారు తీసుకొచ్చిన ఆటోను కూడా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Related Stories: