కుక్కకు చుక్కలు చూపించిన కొండ చిలువ.. వీడియో

నిన్న గాక మొన్ననే కదా ఓ కొండ చిలువ మహిళను మింగేసిందని చదువుకున్నాం. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇక.. ప్రస్తుతం మరో కొండ చిలువకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఓ కుక్కను కొండ చిలువ అమాంతం పట్టేసుకున్న వీడియో అది. థాయిలాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. కుక్కపై అటాక్ చేసిన కొండ చిలువ దాన్ని తినడానికి ప్రయత్నించింది. దాన్ని కదలకుండా చుట్టేసిన కొండచిలువ దాన్ని మింగలేకపోయింది. ఇక ఆ కుక్క బిక్కుబిక్కుమంటూ దాని చెరలో బంధీ అయిపోయింది. ఇక.. కొండ చిలువను గమనించిన స్థానికులు కర్రలతో కొట్టి మరీ దాని నుంచి కుక్కను విడిపించారు. కుక్క దాని నుంచి విడిపోగానే బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Stories: