బల్దియా కాంట్రాక్టర్.. అదృశ్యం

హైదరాబాద్ : కాంట్రాక్ట్ పనుల కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన జీహెచ్‌ఎంసీ లేబర్ కాంట్రాక్టర్ అదృశ్యమయ్యాడు. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట, ప్రేమ్‌నగర్‌లో నివాసముండే వరికుప్పల కృష్ణ (45) జీహెచ్‌ఎంసీలో లేబర్ కాంట్రాక్టర్. ఈ నెల 11న లిబర్టీ వద్ద జోనల్ కమిషనర్ కార్యాలయంలో పని ఉందంటూ ఇంటి నుంచి స్కూటీపై వెళ్లాడు. సా యంత్రం వరకు కూడా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతని భార్య శారద సదరు కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడ స్కూటీ పార్క్ చేసి ఉంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా .. కృష్ణ తన వెంట రూ.8లక్షలు తీసుకు వెళ్లాడని, రెండు నెలల క్రితం కూడా ఎవరికి చెప్పకుండా వెళ్లి... 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది.
× RELATED నెగేటివ్ రోల్ లో వరుణ్ తేజ్..?