వెండితెరపై ఘంటసాల జీవితం!

మధురగాయకుడిగా, సంగీత దర్శకుడిగా చెరగని గుర్తింపును సొంతం చేసుకున్నారు ఘంటసాల. ఆయన జీవితంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో ఘంటాసాల ది గ్రేట్ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. యువ గాయకుడు కృష్ణచైతన్య, మృదుల, సుబ్బరాయశర్మ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. సి.హెచ్. రామారావు దర్శకుడు. అన్యుక్తరం ప్రొడక్షన్స్ పతాకంపై లక్ష్మీ నీరజ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ఘంటసాల అంటే పాట, పాట అంటే ఘంటసాల అని అందరికి తెలుసు. ఆయన గొప్పదనాన్ని అందరికి తెలియజెప్పే ప్రయత్నమే ఈ సినిమా. జీవన ప్రయాణంలో ఎన్నో ముళ్ల బాటల్లో నడిచిన ఘంటసాల మనకు మాత్రం పూల వంటి పాటల్ని అందించారు. ఆయన జీవితంలోని తెలిసిన, తెలియని కోణాల్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాం. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

× RELATED ముఖ్య అతిథులుగా..