'2.ఓ' 3డీ టీజ‌ర్ ఉచితంగా చూసే అవ‌కాశం

ఈ దేశం ఆ దేశం అనే తేడా లేకుండా ప్ర‌పంచ మంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 2.ఓ. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్‌, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో దాదాపు 543 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. న‌వంబ‌ర్ 29న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నట్టు మేక‌ర్స్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. సినిమా మొత్తాన్ని 3డీ కెమెరాల‌తో తెర‌కెక్కించిన శంక‌ర్ టీజ‌ర్‌ని కూడా 3డీ ఫార్మాట్‌లోనే విడుద‌ల చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో చిత్ర టీజర్‌ను థియేటర్‌లలో ప్రీమియర్‌గా ప్రదర్శించనున్నారు. ఇందుకోసం దగ్గర్లోని పీవీఆర్‌, సత్యం థియేటర్స్‌లో 3డీ టీజ‌ర్‌ని ఉచితంగా చూడవచ్చని శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. అయితే ఇందుకోసం మ‌నం చేయాల్సింది 90999 49466 అనే నెంబ‌ర్‌కు మిస్డ్‌కాల్‌ ఇచ్చి ఉచిత టికెట్‌ను బుక్‌ చేసుకోవడం. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మిస్డ్ కాల్ ఇచ్చి టీజ‌ర్‌ని ఉచితంగా థియేట‌ర్‌లో చూసే అవ‌కాశం పొందండి.
× RELATED ఒంటిపై కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్య