‘గోల్డ్‌’ను బీట్ చేసిన ‘గీత గోవిందం’..కలెక్షన్లు తెలుసా..?

టాలీవుడ్ యాక్టర్ విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్‌హిట్ టాక్‌తో బాక్సాపీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నట్లు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు.

గీత గోవిందం ఓవర్సీస్‌లో అక్షయ్‌కుమార్ నటించిన గోల్డ్‌తోపాటు మరో చిత్రం సత్యమేవ జయతే సినిమాలను అధిగమించి తనదైన కలెక్షన్లను వసూలు చేస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియాలో గోల్డ్, సత్యమేవ జయతే చిత్రాలు 192,306 డాలర్లు (కోటి 34 లక్షలకుపైగా)రాబట్టగా..తెలుగు సినిమా గీత గోవిందం వాటిని అధిగమిస్తూ 202,266 (కోటి 40 లక్షలకుపైగా)డాలర్లు వసూలు చేసిందని తరణ్ ఆదర్శ్ చెప్పాడు. గీత గోవిందం యూఎస్‌లో 1.5 మిలియన్లు వసూలు చేసినట్లు వెల్లడించాడు.

× RELATED కాంగ్రెస్‌లా కాదు.. వందకు వందశాతం రుణమాఫీ : సీఎం