100 కోట్ల క్లబ్‌లో చేరిన గీత గోవిందం..

నాచురల్ స్టార్ నానీలాగే ఉంటుంది ఆ నటుడి నటన. మన పక్కింటి వ్యక్తితో మాట్లాడినట్టుగా.. మన ఫ్రెండ్‌తో సరదాగా మాట్లాడితే ఎలా ఉంటతో అచ్చం అలాగే ఉంటది ఆ యువ హీరో ప్రవర్తన. ఏమాత్రం భయం లేకుండా.. ఏమాత్రం తడబడకుండా ఓ కొత్త శైలిలో నటించడం విజయ్ దేవరకొండకే కుదిరింది. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఒకేసారి పెళ్లి చూపులు సినిమాతో హిట్ కొట్టి ప్రభంజనం సృష్టించాడు విజయ్. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తెలుగు ఇండస్ట్రీ రాతలనే మార్చాడు. తర్వాత మహానటిలో నటించినా.. అది అతడి పూర్తిస్థాయి సినిమా కాదు. ఆ తర్వాత వచ్చిన గీతగోవిందంతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. దాంతో పాటు గీతాగోవిందం సినిమా రిలీజయిన 12 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయి మరో రికార్డు సాధించాడు విజయ్. దీంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిన అతి తక్కువ హీరోల జాబితాలోకి ఎక్కేశాడు విజయ్. యూఎస్‌లో గీత గోవిందం సినిమా ఇప్పటికే 2 మిలియన్ మార్క్‌ను దాటింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించగా.. వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సుబ్బరాజు, అను ఇమ్మాన్యుయేల్, నిత్యా మేనన్, అన్నపూర్ణ, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక.. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ, రష్మిక నటన ప్లస్ పాయింట్ అయింది.

Related Stories: