ఆవును వదిలేస్తున్నాడనుకుని వృద్ధునిపై గోరక్షకుల దాడి

యూపీలో గోసంరక్షకులమని చెప్పుకునేవారు ఓ 70 సంవత్సరాల వృద్ధుని చితకబాదారు. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ఆగస్టు 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కైలాశ్‌నాథ్ శుక్లా అనే వ్యక్తి జబ్బుపడ్డ ఆవును పొరుగూరికి తీసుకువెళ్తుండగా కొందరు అడ్డగించారు. ఆవును వదిలేస్తున్నట్టు అనుమానించి కొట్టడం మొదలుపెట్టారు. ఆయన తనను వదిలేయమని బతిమాలినా వినకుండా ఒకరి వెనుక ఒకరు వంతులవారీగా కర్రలతో కొట్టారు. అంతటితో ఆపకుండా గుండుగీయించి ముఖానికి నల్లరంగు పూసి ఊరేగించారు. ఈ దారుణమైన అవమానం తర్వాత శుక్లా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సీనియర్ల జోక్యంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. ప్రత్యక్ష సాక్షులను విచారించిన తర్వాత నలుగురిని అరెస్టు చేశారు. మరికొందరిని అరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. డ్యూటీలో ఉండి వృద్ధుని ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించిన పోలీసు సిబ్బందిపై కూడా చర్య తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Related Stories: