20వ శతాబ్దిలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదం

భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై ఐరాస నివేదికలో వెల్లడి న్యూయార్క్, ఏప్రిల్ 20: వేల మంది ప్రాణాలను బలిగొన్న 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన 20వ శతాబ్దంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదమని ఐక్యరాజ్యసమితి(ఐరాస) నివేదిక పేర్కొంది. 1984లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి లీకైన 30 టన్నుల మిథేల్ ఐసోసైనేట్ వాయువు 6 లక్షల మందిని ప్రభావితం చేసిందని నివేదిక తెలిపింది.15 వేలమందిని ఆ వాయువు బలి తీసుకున్నది. మరెందరినో తీవ్రమైన వ్యాధుల బారిన పడేసింది. భోపాల్ దుర్ఘటన తర్వాత చెర్నోబిల్, ఫుకుషిమా అణు విపత్తులు, రాణ ప్లాజా భవన విధ్వంసం తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Related Stories: