ముస్తాబవుతున్న ఖైరతాబాద్ గణేశ్.. ఫోటోలు

హైదరాబాద్: వినాయక చవితి అంటేనే ఖైరతాబాద్ గణేశ్. దేవుడి మీద భక్తితో కొందరు, అంత ఎత్తులో కొలువైన వినాయకుడిని చూడటానికి మరికొందరు గణేశ్ నవరాత్రుల సమయంలో ఖైరతాబాద్‌కు క్యూ కడతారు. 2014లో 60 ఫీట్ల ఎత్తులో నిర్మించిన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం రికార్డులను తిరగరాసింది. ఇక.. ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశ్ అత్యంత సుందరంగా అలంకరించబడుతున్నాడు. గణేశ్ చతుర్థి సమీపిస్తుండటంతో త్వరితగతిన గణేశుడి విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశ్ 57 ఫీట్లుగా ఉండనున్నాడట. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 150 మంది పనివాళ్లు మే నుంచి కష్టపడుతున్నారట. సెప్టెంబర్ 6 లోపల గణేశ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యలు తెలిపారు.

Related Stories: