గాలి జ‌నార్థ‌న్‌రెడ్డికి బెయిల్‌

బెంగుళూరు: క‌ర్నాట‌క మాజీ మంత్రి, వివాదాస్ప‌ద మైనింగ్ వ్యాపారి గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేశారు. ల‌క్ష రూపాయ‌ల బాండ్‌పై ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చేందుకు అంగీక‌రించారు. గ‌త ఆదివారం బెంగుళూరు సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయ‌న్ను అరెస్టు చేశారు. పోంజీ స్కాం కేసులో గాలిని అరెస్టు చేశారు. జనార్దన్‌రెడ్డితోపాటు మరో నిందితుడు అలీఖాన్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. ఇస్లామిక్ బ్యాంకింగ్ పేరిట రూ.954కోట్ల వరకు జరిగిన పోంజి స్కాం కేసు నుంచి నిందితులైన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని సయ్యద్ అహ్మద్ ఫరీద్, అతడి కుమారుడిని బయటపడేసేందుకు ప్రయత్నించినట్లు జనార్దన్‌రెడ్డిపై అభియోగాలున్నాయి. మొద‌ట్లో మూడురోజులు జనార్దన్‌రెడ్డి అదృశ్యమవడంతో ఆయన పారిపోయినట్లు ప్రచారం జరిగింది. నాటకీయంగా ఆయన శనివారం బెంగళూరులోని సీసీబీ కార్యాలయానికి తన న్యాయవాదితో కలిసి వచ్చారు. తాను నిరపరాధినని, రాజకీయ కుట్రతోనే తనను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాకు చెప్పారు.

Related Stories: