స్వాతంత్ర్య సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి మృతి

సూర్యాపేట: సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఆయన మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానిక నాయకులు నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్, వై. వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్ నాగిరెడ్డి పాపిరెడ్డి మృతికి నివాళులర్పించారు.

Related Stories: